06-12-2025 10:26:50 PM
జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్..
నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ సూచించారు. ఎన్నికల డ్యూటీలో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎక్కడ ఏ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఓటర్లకు పూర్తిగా పారదర్శకమైన, భద్రతతో కూడిన వాతావరణాన్ని కల్పించడం సిబ్బంది ప్రధాన బాధ్యత అని తెలిపారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఎస్పీ స్పష్టం చేశారు. ఎవరూ ఎన్నికల ప్రక్రియను భంగపరచడానికి ప్రయత్నించినా, చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిబ్బంది అందరూ అప్రమత్తంగా, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని, ప్రతి పోలింగ్ సెంటర్‌లో స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించాలని ఎస్పీ ఆదేశించారు.