calender_icon.png 6 December, 2025 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఉద్యమకారుడు మల్లేష్ గౌడ్..

06-12-2025 10:25:13 PM

రానున్న రోజుల్లో ఇదే తరహాలో చేరికలు..

గుమ్మడిదల: గుమ్మడిదల బీఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు మల్లేష్ గౌడ్ బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తూ పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యమకారులను విస్మరించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమవుతుందని అసహనం వ్యక్తం చేశారు. ఏదేమైనాప్పటికీ కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిదని ఎలాంటి వారికైనా ఆశ్రయమిస్తుందని రానున్న రోజుల్లో తనకు నియోజకవర్గ స్థాయిలో అత్యున్నతమైనటువంటి స్థానం కల్పించనున్నామన్నారు.

ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో మండల స్థాయిలో అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థులను గెలిపించుకోవడానికి తమరి సయ శక్తుల కృషి చేయాలని తెలిపారు కార్యక్రమంలో నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట నర్సింగరావు, జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్డే కృష్ణ మాజీ ఉపసర్పంచ్ కొత్తపల్లి విజయ్ కుమార్ తో పాటు తదితరులు ఉన్నారు.