calender_icon.png 28 October, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

27-10-2025 10:10:18 PM

- ట్రాఫిక్ సీఐ జితేందర్ రెడ్డి..

- కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉంటే బుక్ అయిపోతారు జాగ్రత్త..

ఇబ్రహీంపట్నం: నిబంధనలు అతిక్రమించి, కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ సీఐ జితేందర్ రెడ్డి హెచ్చరించారు. నిబంధనల ప్రకారం కారు అద్దాలకు ఎలాంటి తెరలు ఏర్పాటు చేసిన, అద్దాలకు టింటెడ్ ఫిలింను ఏర్పాటు చేసిన, సైరన్ మల్టీ- టోన్డ్ హారన్ ల వాడకానికి వ్యతిరేకంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని జితేందర్ రెడ్డి అన్నారు. ఈ తనిఖీల్లో ఆర్ఎస్ఐ సాయినాథ్, ఎస్ఐ పి. వెంకటయ్య సిబ్బందితో కలిసి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో సోమవారం అంబేద్కర్ చౌరస్తాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కారు అద్దాలకు టింటెడ్ ఫిలిం అమర్చుకొని వెళ్తున్న వాహనదారులకు జరిమానాలు విధించి అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ లను ఆయన తొలగించారు.

కారులో ఎవరు వెళ్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, అనే దృశ్యాలు స్పష్టంగా కనిపించాలనే నిబంధన ఉన్నప్పటికీ కొంతమంది అవేవీ పట్టించుకోకుండా నల్ల తెరలను  ఏర్పాటు చేసుకొని యదేచ్చగా తిరుగుతున్నారని అలాంటి వారిని ఉపేక్షించమని ఆయన అన్నారు. వాహనాల ముందు విండోకు 70 శాతం వెలుతురు వచ్చే విధంగా, వెనుక విండోకు 50 శాతానికి తక్కువ కాకుండా వెలుతురు వచ్చే విధంగా తయారు చేయాలని నిబంధనలున్నాయన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బ్లాక్ ఫిల్మ్ లను తొలగించడంతో పాటు రూ.1000 రూపాయల జరిమానా విధిస్తున్నట్లు జితేందర్ రెడ్డి తెలిపారు. అనంతరం పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.