calender_icon.png 28 October, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

27-10-2025 10:06:37 PM

కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): నుస్తులాపూర్ స్టేజ్ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న సమయంలో రెండు బైకులు ఢీకొని వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతతో రెండు బైకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రెండు బైకులు కూడా అధికవేగంతో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక బైక్ రోడ్డు దాటుతుండగా, మరొకటి ఎదురుగా వస్తూ బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు బైక్ ల వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా.. వెంటనే స్థానికులు వారిని అంబులెన్స్ సహాయంతో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.