calender_icon.png 8 December, 2025 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

07-12-2025 08:18:20 PM

సీఐ సంతోష్ కుమార్..

బెజ్జూర్ (విజయక్రాంతి): రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయడం లక్ష్యంగా కౌటాల పోలీస్ స్టేషన్ సీఐ సంతోష్ సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు అందుబాటులో ఉన్న పోలీసు బలగాలతో కలిసి బెజ్జూర్, కుకుడ గ్రామాల్లో విస్తృతంగా ఫ్లాగ్ మార్చ్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహించినట్లు తెలిపారు. సీఐ సంతోష్ మాట్లాడుతూ ఎన్నికల శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అవసరమైతే అదనపు బందోబస్తు మోహరింపుకు విభాగం పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు. సున్నితమైన ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి పర్యవేక్షణను మరింత బలోపేతం చేసినట్టు పేర్కొన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే అట్టి వారిపై కేసులు నమోదు అవుతాయని అన్నారు. చదువుకునే యువత ఎన్నికల ప్రచారంలో పాల్గొని అల్లర్లలో ఇరుక్కుపోతే ఉద్యోగాల సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చదువుకునే యువత మెలగాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకునేందుకు అన్ని పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సర్తాజ్ పాషా, చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.