calender_icon.png 8 December, 2025 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పులి పాదముద్రలను పరిశీలించిన ఫారెస్ట్ శిక్షణ బీట్ అధికారులు

07-12-2025 08:21:13 PM

పులి కదలికలపై ఆరా..

బెజ్జూర్ (విజయక్రాంతి): హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 38 మంది బీట్ అధికారులు ఆదివారం బెజ్జూరు అడవుల్లో పర్యటించి వివరాలను తెలుసుకొని క్షేత్ర పర్యటన చేశారు. ఫీల్డ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్, స్థానిక అటవీ అధికారుల బృందంతో ఇక్కడి అటవీ ప్రాంత ప్రాముఖ్యతను వివరించారు. మండలంలో కృష్ణపల్లి సెక్షన్ పరిధిలోని ఇందురుగాం బీట్లోని రాముడు భీముడు టేకు చెట్లు, బేస్ క్యాంపును పరిశీలించారు. అనంతరం మాణిక్య దేవారా అటవీ ప్రాంతంలో పులుల ఆవాస ప్రాంతాన్ని పరిశీలించారు.

పులుల కదలికలు, వాటి పాదముద్రలు పరి శీలించి వివరాలను తెలుసుకున్నారు. పెద్దపులి ఎటు నుంచి ఎటువైపు వెళుతుందో పాదముద్రల ఆధారంగా గమనిస్తూ వెళ్లారు. అంతేకాకుండా ఎక్కడి అటవీ ప్రాంతం జీవవైవిద్యంతో కూడిందని ఈ ప్రాంతంలో వివిధ రకాల పక్షులు, వన్య ప్రాణుల గురించి వివరించారు. వారి వెంట రేంజ్ అధికారి ముసావీర్, డిప్యూటీ రేంజ్ అధికారి శ్రావణ్, సెక్షన్ అధికారి సోఫియా, బీట్ అధికారి గోపాల్ ఇతర సిబ్బంది ఉన్నారు.