చురుకుగా కదులుతున్న రుతుపవనాలు
నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా రుతుపవ నాలు చురుకుగా కదులుతున్నాయి. సోమవారం నుంచి 5 రోజులపాటు పలు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడిచింది. ఈ నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశాతో పాటు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ముంబై, తెలంగాణతో సహా మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు ముందుగా వర్‌సాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ క్రమంలో ముంబై, మరఠ్వాడ, కొకంణ్, గోవా, మధ్య కర్ణాటక, కేరళ, లక్షద్వీప్‌లలో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్రాషలు కురుస్తాయని అంచనావ వేసింది. దీంతోపాటు కోస్త్రాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు, పుదుర్చేరిలలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మరోవైపు రానున్న ఐదు రోజుల్లో తూర్పు మధ్య భారతదేశం, ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
వచ్చే ఐదు రోజుల్లో అరుణాచల్‌ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, బెంగాల్, సిక్కింలలో ఉరుములు, ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈక్రమంలో కేరళలలోని పతనంతిట్ట, కోడికోడ్, వయనాడ్, కన్నూరు, కాసర్‌గోడ్‌లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లారం, అలప్పజగా, కొట్టాయం, ఇడుక్కి, ఏర్నాకులం, త్రిసూర్, మలప్పరంతో సహా రాష్ట్రంలోని 8జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలోని ఖమ్మ జిల్లా కల్లూరులో 34.6మి.మీ. వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.






