జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో గరుకుల విద్యార్థుల హవా
10-06-2024 12:42 AM
నిఖితకు 267, ఆర్.పల్లవికు 306
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో బీసీ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో బీసీ గురుకుల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు పొందారు. ముగ్గురు అమ్మాయిలు బి.నిఖిత(267), ఆర్. పల్లవి(306), ఎస్. నందిని(768) ర్యాంకులు సాధించగా, ముగ్గురు అబ్బాయిలు కూడా వెయ్యి నుంచి ఐదు వేలలోపు ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఇదిలా ఉంటే ఎస్సీ కేటగిరీలో ఖమ్మం జిల్లాకు చెందిన గుంజలూరి చరితశ్రీ ఈ ఫలితాల్లో 334 ర్యాంకు సాధించింది.






