30న ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం
ముషీరాబాద్, మే 25 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ప్రతినిధులతో ఈనెల 30న బాగ్‌లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సమావేశం నిర్వహించనున్నట్టు తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కాచం సత్యనారాయణ గు ప్తా తెలిపారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఉద్యమకారుల గుర్తింపు కేకే కమిటీ సభ్యులు మోతె శోభన్ రెడ్డితో కలిసి ఆయన 30న జరిగే సమావేశానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించా రు.
ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ గుప్త మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులతో సుదీర్ఘంగా చర్చించి, వారి సూచనలు, సలహాలు నివేదిక రూపంలో కమిటీ ప్రతినిధులకు అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నేత ఆర్.వి.మహేందర్, ఉద్యమకారులు వెంకట్ రెడ్డి, పల్లె వినయ్, కుర్వ రమేశ్, ఉప్పల శ్రవణ్, కొత్త రవి, సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.






