calender_icon.png 19 June, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రష్మికతో ఆ మాట చెప్పాలనిపించింది!

19-06-2025 05:41:45 PM

ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌వీసీఎల్‌ఎల్‌పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్‌మోహన్‌రావు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగార్జున(Nagarjuna) విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

‘కుబేర’ లాంటి మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ చేయడానికి కారణం?

-మంచి కథలు రావాలంటే స్టార్స్ కలిసి పనిచేయాలి. ఇంతకుముందు కూడా నేను చాలా సినిమాలు చేశాను. నాన్న గారు (ఏఎన్‌ఆర్) ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, శోభన్‌బాబు గారు.. ఇలా అంత మంది కలిసి ఎన్నో సినిమాలు చేశారు. -శేఖర్ కమ్ముల గారితో వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఉండేది. ‘ఆనంద్’ దగ్గర నుంచి ఆయన సినిమాలు గురించి మనందరికీ తెలుసు. ఆయన సినిమాలు నాకు బాగా ఇష్టం. ఆయన కథల్లో సోషల్ రెలివెంట్ పాయింట్ ఉంటుంది. మిగతావన్నీ కూడా కమర్షియల్‌గానే ఉంటాయి. అద్భుతమైన పాటలు ఉంటాయి.

‘కుబేర’లో ఉన్న యూనిక్ పాయింట్ ఏమిటి?

‘-కుబేర’లో చాలా మంచి యూనిక్ పాయింట్ ఉంది. ఇప్పుడున్న సొసైటీకి ఆ పాయింట్ చాలా రిలెవెంట్. శేఖర్ గారికి ఈ పాయింట్ మైండ్‌లో ఎప్పటినుంచో ఉంది. -ఈ సినిమాలో మంచోళ్లు ఉన్నారు.. చెడ్డోళ్లు ఉన్నారు. అల్ట్రారిచ్, మిడిల్ క్లాస్, బిలో పావర్టీ లైన్.. ఇలా మూడు సొసైటీల మధ్య క్లాష్ ఈ సినిమాలో ఉంటుంది.  

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

-నాది మిడిల్ క్లాస్ క్యారెక్టర్. సీబీఐ ఆఫీసర్ క్యారెక్టర్‌లో కనిపిస్తాను. మంచి చేయాలా? చెడు చేయాలా? అనే సంఘర్షణ మధ్య ఆ క్యారెక్టర్ ఉంటుంది. నా క్యారెక్టర్‌లో చాలా షేడ్స్ ఉంటాయి. శేఖర్ నా క్యారెక్టర్‌ను చాలా అద్భుతంగా రాశారు. షటిల్ పెర్ఫార్మన్స్‌కు మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్. ఇందులో చాలా అద్భుతమైన ఇన్సిడెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా రియల్ లైఫ్‌కు రిలేటెడ్‌గా ఉంటాయి. -ధనుష్ తన పాత్రలో ఒదిగిపోయాడు. అద్భుతంగా చేశాడు. 

శేఖర్ గారు మీ ఇమేజ్‌కు తగ్గట్టు స్క్రిప్ట్‌లో ఏమైనా మార్పులు చేశారా?

-లేదండి.. ఆయన ఏమనుకున్నారో అదే చేశారు. నేను కూడా ఎలాంటి మార్పులు అడగలేదు. మారిస్తే చెడిపోతుంది.

మీ ఫ్యామిలీలో దాదాపు అందరూ శేఖర్ కమ్ముల గారితో చేశారు కదా.. ఆయన స్టుల్ గురించి ముందుగా ఎవరినైనా అడిగారా?

-చైతన్యను అడిగాను. ‘ఆయన వర్కింగ్ స్టుల్ చాలా బాగుంటుంది. మీరు సినిమా అంతా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు. 

ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్ అన్నిటిలో కుబేరలో క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుందా?

- ఈ సినిమా కథ డిఫరెంట్. నా బాడీ లాంగ్వేజ్, మాట తీరు, రియాక్షన్.. అవన్నీ కూడా కొత్తగా ఉంటాయి. శేఖర్ కమ్ముల స్టుల్‌లో ఉంటాయి. సినిమాను దాదాపు రియల్ లొకేషన్స్‌లోనే షూట్ చేశాం. తిరుపతి, ముంబయి, గోవా, బ్యాంకాక్.. ఇలా అన్ని బిగ్ రియల్ లొకేషన్స్‌లో వర్క్ చేశాం. 

రష్మిక మందన్న క్యారెక్టర్ ఎలా ఉంటుంది?  

-తన క్యారెక్టర్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. తను చాలా అద్భుతంగా చేసింది. సినిమా చూసి నువ్వే స్టార్ అని చెప్పాను. ఆ కథలో చాలా రిప్రెషన్ క్యారెక్టర్ అది.

కుబేర నిర్మాతల గురించి..?

సునీల్ నారంగ్, పుష్కర రామ్మోహన్ గారు ఒక పెద్ద సినిమా చేయాలనుకున్నారు. తెలుగు, తమిళ్.. పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్టును చేశారు. చాలా పాషన్‌తో సినిమా తీశారు. డైరెక్టర్ శేఖర్ కమ్ములకు కావాల్సింది ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇచ్చారు. సినిమా చాలా అద్భుతమైన క్వాలిటీతో వచ్చింది.

దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ గురించి..?  

-ఈ సినిమాకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. పాటలు చాలా సిచువేషనల్‌గా వస్తాయి. దేవి వండర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. -ఈ కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. రెగ్యులర్ స్క్రీన్‌ప్లే కాదు. రొటీన్ క్యారెక్టర్స్ కావు. ప్రతీది డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో ఏ క్యారెక్టర్ కూడా హీరో హీరోయిన్ అనడానికి లేదు. అన్నీ పాత్రలుగానే ఉంటాయి. ఇలాంటి సినిమాలు చేయడానికి గట్స్ కావాలి. 

100 సినిమా ప్లానింగ్స్ జరుగుతున్నాయని విన్నాం..?! 

అవునండి.. ప్లానింగ్ చేస్తున్నాం. వర్కింగ్ టైటిల్ ‘కింగ్ 100’ అని పెట్టారు.

చాలా ఫిట్‌గా కనిపిస్తున్నారు..! ఈ మధ్యకాలంలో ఆహార నియమాల్లో ఏమైనా మార్పులు చేశారా? 

లేదండి. గత 15 ఏళ్లుగా ఏం చేస్తున్నానో అదే చేస్తున్నా. కొత్తగా చేసింది ఏమీ లేదు.

పాన్‌ఇండియా ట్రెండ్ మీద మీ ఒపీనియన్..?

-పాన్ ఇండియా సినిమాలు చేయడం చాలా కష్టమైన పని. అన్ని సినిమాలు దానికి సరిపోవు. పాన్ ఇండియా సినిమా అని తీసినవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం లేదు కదా.

శివ 4కే పనులు ఎంతవరకు వచ్చాయి?

ఫినిష్ అయింది.. ఇంకా బెటర్ ఎఫెక్ట్స్ కోసం వర్క్ జరుగుతోంది. చాలా బాగా వస్తుంది. ఒక రీల్ చూశాను. చాలా అద్భుతంగా ఉంది.

సితార బ్యానర్‌లో మీరు ఒక సినిమా చేస్తారని విన్నాం?

సితార, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ఇలా అందరికీ చేయాలని ఉంది. అయితే  ప్రాజెక్ట్ సెట్ కావాలి.

‘కూలీ’లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది?

‘-కూలీ’లో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. లోకేశ్ కనకరాజ్ కంప్లీట్ న్యూ ఏజ్ డైరెక్టర్. క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. ఫస్ట్ టైమ్ ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేశాను.