19-06-2025 12:19:09 AM
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్‌హిట్ మూవీ ‘తమ్ముడు’. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమిగౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ బుధవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, హీరో నితిన్, నటి లయ, టీమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ.. “ఇన్ని కుటుంబాల మధ్య ‘భూ అంటే భూతం’ సాంగ్ రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది.
ఈ సినిమా కోసం 80 రోజులు అడవిలో షూటింగ్ చేశాం. ఆ టైమ్‌లో టీమ్ అంతా ఫ్యామిలీలా కలిసిపోయాం. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో తమ్ముడు సినిమా రూపొందింది” అన్నారు. లయ మాట్లాడుతూ.. “చాలా గ్యాప్ తర్వాత నేను మళ్లీ తమ్ముడు చిత్రంతో టాలీవుడ్‌కు వస్తున్నా. ఈ పాటలోని హుక్ స్టెప్ అందరికీ నచ్చుతుంది. ఈ సాంగ్ వీడియోస్ చేసి సోషల్ మీడియాలో నాకు ట్యాగ్ చేయండి.
తప్పకుండా రిప్లు ఇస్తా” అని చెప్పారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఇప్పటిదాకా మా బ్యానర్‌లో తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో బొమ్మరిల్లు, అన్నదమ్ముల కథతో సీతమ్మ వాకిట్లో.. వంటి చిత్రాలు రూపొందాయి. ఫస్ట్‌టైమ్ బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్‌తో తమ్ముడు చిత్రాన్ని తీశాం. ఈ సినిమాను ఎన్నో వావ్ మూవ్‌మెంట్స్‌తో రూపొందిం చాం” అని తెలిపారు.