30 May, 2026 | 9:18 PM

Breaking News

నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు: సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు   •   ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలి   •   ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ రాష్ట్రానికి మొదటి స్థానం   •   సత్యనారాయణపురం గ్రామంలో భూ సమస్యలపై సమావేశం   •   పంచాయతీ కార్యదర్శిపై చేయి చేసుకున్న సీనియర్ అసిస్టెంట్   •   ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ హల్‌చల్   •   కమనీయం.. రమనీయంగా వనదుర్గమ్మ పల్లకి సేవ   •   చెరువులో పడి మృతి చెందిన శంకర్ మృతదేహం వెలికి తీత   •   జూన్ 3న వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు జిల్లా మహాసభను విజయవంతం చేయాలి   •   ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు   •  

ఇంటర్ ఫలితాల్లో ఆదర్శ హవా

13-04-2026 03:43 AM

ఫస్ట్ ఇయర్‌లో సత్తా చాటిన విద్యార్థులు

మంచిర్యాల, ఏప్రిల్ 12 (విజయక్రాంతి) : మంచిర్యాల పట్టణం రాజీవ్ నగర్ లోని ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) విద్యార్థులు కార్పొరేట్ కాలేజీలకు తలదన్నేలా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి అందరి మన్ననలు పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తం గా ప్రభుత్వ కళాశాలల కేటగిరీలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో దానపెల్లి రిశ్విక 470 మార్కులకు 468 మార్కులతో మొదటి స్థానంలో నిలిచి జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో నిలిపింది.

అలాగే బైపీసీ విభాగంలో చప్పిడి వైష్ణవి 440 మార్కులకు 434 మార్కులతో, సెకండియర్ ఎంపీసీ విభాగంలో మెండు అమూ ల్య 992 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకు లు సాధించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను  మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు అభినందించారు.