ఈసీ పనితీరుపై ఉన్నతస్థాయి విచారణ : అద్దంకి దయాకర్
18-06-2024 03:13 PM
హైదరాబాద్ : ఈవీఎంలపై ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ఈసీ పనితీరుపై ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈవీఎంల వల్ల భారత ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు అని ఆరోపిచారు. టెక్నాలజీ మార్పు వల్ల ఈవీఎంలు హ్యాక్ చేయవచ్చన్నారు.






