14 August, 2026 | 3:13 AM

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎంఎల్ఎ కానుక

18-06-2024 02:44 PM

మహబూబ్ నగర్: గత నెలలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని ఎంఎల్ఎ అనిరుధ్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ లో ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీన రైతులకు రెండు లక్షల రుణమాఫీ కచ్చితంగా జరుగుతదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తామని తెలిపడం జరిగిందన్నారు. అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు నేను పాదయాత్ర చేస్తూ జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ షూలు ఇప్పిస్తానని చెప్పారు.

నేడు నియోజకవర్గంలోని 274 పాఠశాలలోని 53 వేల పైచిలుకు విద్యార్థులందరికీ షూ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఆగస్టు చివరిలోగా మా కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను కమిటీలుగా వేసి ఆయా గ్రామాలలో ఉన్న పాఠశాల వెళ్లి విద్యార్థుల సైజులు తీసుకొని విద్యార్థులకు షూలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో జడ్చర్లలోనే మొదటిదని అన్నారు.

ఇంతకు ముందులాగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎలాగైతే విద్యను అభ్యసించేవారో ఆ విధంగానే పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ వారం రోజులలో పాఠశాలలో నా స్నేహితుల సహకారంతో 20 మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అలాగే 20 టీవీలు కూడా తెప్పించాము. ఎలక్షన్ కోడ్ ఉండడంవల్ల అవి పాఠశాలలో అమర్చలేకపోయాము. తొందర్లోనే ఆ టీవీలను పాఠశాలలో అమర్చి విద్యార్థులకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, ఆన్లైన్ క్లాసులు వినడానికి ఉపయోగపడేలా చేస్తామని అన్నారు.