19 May, 2026 | 7:27 PM

ఇంధన ధరల పెంపుతో సామాన్య ప్రజలపై అదనపు భారం

19-05-2026 06:20 PM

గుగులోతు నీలాహేమ్లా నాయక్

గరిడేపల్లి,(విజయక్రాంతి): పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు,హుజూర్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుగులోతు నీలాహేమ్లా నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన గరిడేపల్లి లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఇప్పటికే వంటగ్యాస్ ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా తాజా పెంపు సామాన్యులకు మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిరు ఉద్యోగులు, చిన్న వ్యాపారులు,ఆటో డ్రైవర్లు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.లారీ రవాణా ఖర్చులు పెరగడంతో మార్కెట్‌లో కూరగాయలు,పాలు, పండ్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలను నియంత్రించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.ధరల పెరుగుదలతో మధ్యతరగతి, పేద కుటుంబాల జీవనం మరింత కష్టంగా మారిందన్నారు