19 May, 2026 | 7:06 PM

Breaking News

జైనూర్‌లో రైతులకు సేంద్రియ సాగుపై అవగాహన సదస్సు   •   చెరువుల సుందరీకరణకు సహకరించాలి   •   ఘనంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి వేడుకలు   •   ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి   •   జిల్లాలో డ్రగ్స్,గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   తంగళ్లపల్లి మండలంలో తహసీల్దార్, ఎంపీడీవో పోస్టులు భర్తీ చేయాలి   •   విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగినప్పుడే ఉన్నత స్థానాలకు చేరుకుంటారు   •   సింగరేణి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన యువతకు ఉద్యోగ అవకాశాలు   •   పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు కృషి చేయాలి   •   కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలు సాధించాలి   •  

మైనార్టీ గురుకుల కళాశాలలో ఎంపీసీ, బైపీసీకి అడ్మిషన్ ప్రారంభం

19-05-2026 06:17 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్ మైనారిటీ గురుకుల బాయ్స్ కళాశాల యందు  అడ్మిషన్ లు ప్రారంభమైనవి. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ మరియు బైపిసి ఫస్ట్ ఇయర్ లలో ప్రవేశం కొరకు వెనుకబడిన  ముస్లిం మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగలరు అని మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎండి జావిద్  తెలిపారు. మా వద్ద  ఎంపీసీలో  మైనారిటీ  30 నాన్ మైనారిటీ40) మరియు   బైపిసిలో (మైనారిటీ 30+నాన్మైనారిటీ 40) సీట్లు అందుబాటులో ఉన్నాయి.

మా వధ అనేకా ఉచిత సౌకర్యాలు గలవు. ఉచిత విద్య అనుభవజ్ఞులైన  అధ్యాపకుల చేత నాణ్యమైన విద్య ను అందించడం, నాణ్యమైన ఉచిత భోజనం  పాలు మరియు బుస్ట్ అల్పాహారం, మధ్యాహ్న భోజనం, స్నాక్స్ మరియు రాత్రి భోజనం, పుస్తకాలు, నోట్ బుక్స్, కాస్మెటిక్ కిట్స్, యూనిఫాం మరియు స్టేషనరీ వస్తువులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో సువిశాలమైన  ఆట మైదానం, విశాలమైన తరగతి గదులలో బోధన.

 ఎంసెట్ కొరకు ప్రత్యేక తరగతులు నిర్వహించబడును. వివిధ రకాల పోటీపరీక్షల పై అవగాహన కల్పించి తగిన రీతిలో విద్యార్థులను సన్నద్ధం  చేయడం మా ప్రత్యేకత. కరికులర్ ఆక్టివిటీస్ ఆటల పోటీలు, వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించబడును. లిమిటెడ్ సీట్లు మాత్రమే నాన్ మైనార్టీలకు కలవు. ఆసక్తి గల వారు ఈ క్రింది నెంబర్ :8096117156, 8106636777 కు సంప్రదించగలరు.