24 April, 2026 | 2:06 AM

విద్యార్థుల కోసం అదనంగా బస్సు నడపాలి

20-09-2025 12:12 AM

గద్వాల టౌన్, సెప్టెంబర్ 19 : విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని అదనంగా బస్సు లను నడపాలని పి వై ఎల్, జిల్లా అధ్యక్షులు. బీరెల్లి దానయ్య గద్వాల డిపో ఆఫీస్ సూపర్వుజర్ విజయకుమార్ కోరారు. శుక్రవారం నాయకులతో కలిసి డిపో ఆఫీస్ సూపర్వుజర్ కు ఆయన వినతిపత్రంను అందచేశారు.

ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ నెట్టెంపాడు, ఖమ్మంపాడు,గార్లపాడు,నాగర్ దొడ్డి,ఉప్పెరు,ద్యాగ దొడ్డి,వామనపల్లి,గూడెం దొడ్డి గ్రామాల నుంచి గద్వాలకు వచ్చే విద్యార్థులు ప్రభుత్వ వాహనమైన  బస్సులో ఫుట్ పాత్ పై నిలబడి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారని

విషయాన్నీ దృష్టిలో పెట్టుకుని అదనంగా బస్సు నడపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి. జమ్మిచెడు కార్తీక్, పి వై ఎల్ నాయకులు.రాకేష్, భీమేష్,సునీల్,సాయికుమార్,తదితరులు పాల్గొన్నారు.