20-09-2025 12:11:36 AM
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎస్సై మహేష్ స్థానిక పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన వేలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... భూమలు కొనే వారికీ ముందస్తు హెచ్చరిక. సిర్గాపూర్ మండలం, మండల పరిధిలో కొంత మంది బ్రోకర్స్ (దళరులు), రైతులు కలిసి ఎక్కడో లోయలో, గుట్టల్లో ఉన్న భూములను రోడ్ పక్కన ఉన్నట్లు చూపిస్తారు.
భూమి తక్కువ ధరకే వస్తుందని నమ్మి అగ్రిమెంట్ చేసుకున్నారో మోసపోయినట్టే. పట్ట పాస్ బుక్, డాక్యుమెంట్ ఉందని భూమినీ చూడకుండా కొన్నారో చిక్కుల్లో పడుతారు. భూమి లొకేషన్ కరెక్ట్ ఉందో చూడాలి, గ్రామంలో నిర్ధారణ చేసుకోవాలి, రెవెన్యూ ద్వారా కొనే లొకేషన్ నిజమైనదా కాదా అని నిర్ధారించుకోవాలి. లేకుంటే తొందర పడి అగ్రిమెంట్ ( రీజస్టేషన్) చేసుకొని డబ్బులు ఇచ్చారో ఇబ్బందుల్లో పడుతారు జాగ్రత్త అని ఎస్సై మహేష్ ముందస్తుగా హెచ్చరిక.