24 April, 2026 | 3:32 AM

జాతీయస్థాయి పోటీలకు డిగ్రీ కాలేజ్ విద్యార్థి

20-09-2025 12:13 AM

నాగర్ కర్నూల్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలకు అరుదైన గౌరవం దక్కింది. బిజినేపల్లి మండలం లింగసానిపల్లి గ్రామానికి చెందిన ఆర్.శివకుమార్, నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బిజడ్సీ ద్వితీయ సంవత్సరం చదువుతూ గుజరాత్ లో జరగనున్న ఎన్‌ఎస్‌ఎస్ ప్రీ రిపబ్లిక్ డే సెలక్షన్లకు ఎంపికయ్యాడు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మదన్ మోహన్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఉమాదేవి, అధ్యాపకులు అంజయ్య, వనిత, కోదండరాములు, రామకృష్ణ, దశరథం, రమ్య తదితరులు శివకుమార్‌ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయి వేదికపై మెరిసే శివకుమార్ ప్రతిభ, ఇతర విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.