అభివృద్ధి పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ చంద్రయ్య
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోని అమృత్ 2.O పనులను జిల్లా అదనపు కలెక్టర్ (మున్సిపల్ అడ్మిన్) చంద్రయ్య తో కలిసి పరిశీలించిన బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావస్వాతి పరిశీలించారు. ఈ సందర్బంగా అమృత్ 2.0 తాగునీటి పథకంకు సంబందించిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులకు పనులను వేగవంతంగా పూర్తి చేసి 4నెలల లోపు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైల్వే స్టేషన్ ఏరియాలోని ఫిల్టర్ బెడ్ ను పరిశీలించారు. అధికారులు పనుల పురోగతిని తెలిపారు.
అక్కడి. అక్కడి నుంచి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలో గల పురాతన "జాతికుంట చెరువు ను సందర్శించారు. చెరువు సుందరీకరణ" పనులను జిల్లా అదనపు కలెక్టర్ (మున్సిపల్ అడ్మిన్) చంద్రయ్య, బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి పరిశీలించారు. జాతికుంట చెరువునకు సంబందించిన భూములు ఆక్రమణాలకు, కబ్జాలకు గురికాకుండా చెరువు చుట్టూ కందకం తవ్వి, కట్ట ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ ఇరిగేషన్ EE, DE అధికారులు, స్థానిక వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు కాంపల్లి రాజం ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు దావా రమేష్, కంకటి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.






