పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలం పరిశీలన రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ
12-08-2026 12:19 AM
హన్వాడ, ఆగస్టు 11 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని 2బీహెచ్కే ఇళ్ల సమిపంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు కేటాయించేందుకు ప్రతిపాదించిన స్థలాన్ని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ మంగళవారం పరిశీలించారు.
మంగళవారం తహసీల్దార్, మండల సర్వేయర్తో కలిసి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్, భూమికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఏర్పాటుకు స్థలం అనువుగా ఉందా, భూమి విస్తీర్ణం, సరిహద్దులు తదితర అంశాలపై వివరాలను సేకరించారు. ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించి, పాఠశాల ఏర్పాటుకు అనువైన స్థలంగా ఉందా? అనే అంశంపై అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు






