కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు పూజలు
12-08-2026 12:20 AM
గణపురం, ఆగస్టు11 (విజయ క్రాంతి): ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం బహుళ చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామదేవతలకు పంచామృత అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతినెల నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.






