12 August, 2026 | 1:22 AM

కొండాపూర్ గ్రామంలో చోరీ

12-08-2026 12:19 AM

మూడు తులాల బంగారం అపహరణ

గణపురం, ఆగస్టు 11 (విజయ క్రాంతి): గణపురం మండలంలోని కొండాపూర్ గ్రామంలో చోరీ జరిగింది. దానం సమ్మయ్య ఇంట్లోకి గుర్తుతెలియని దుండగుడు చొరబడి సుమారు మూడు తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గణపురం ఎస్‌ఐ బొరగల అశోక్  సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీకి పాల్పడిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.