3 March, 2026 | 7:56 PM

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

30-11-2025 05:32 PM

బోయినపల్లి (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల నామినేషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్(రెవెన్యూ) గడ్డం నగేష్ ఆదివారం పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని కొదురుపాక, బోయినపల్లి, కోరెం, స్తంభంపల్లిలోని ఆర్ఓ కేంద్రాలను అదనపు కలెక్టర్(రెవెన్యూ) సిద్ధంగా ఉంచిన నామినేషన్ పత్రాలు, హెల్ప్ డెస్క్ పరిశీలించి, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నారాయణరెడ్డి ఏం పీ వో భీమ జయశీల ఉన్నారు.