అవగాహనతోనే క్షయవ్యాధి నిర్మూలన
25-03-2026 12:57 AM
మండల వైద్యాధికారి డాక్టర్ నగేష్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), మార్చి24: క్షయ వ్యాధిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అప్పుడే పూర్తిస్థాయిలో నిర్మించవచ్చునని మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్ నాయక్ అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మండల కేంద్రం అర్వపల్లిలో పీహెచ్సీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధిని తొలి దశలోనే గుర్తించి పూర్తిస్థాయిలో మందులు వాడితే క్షయ మహమ్మారిని అరికట్టవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓ బిచ్చునాయక్, హెల్త్ సూపర్వైజర్ లలిత, నర్సింగ్ ఆఫీసర్లు మాధవి, కళమ్మ, అనూష, ల్యాబ్ టెక్నీషియన్ మహేష్ పాల్గొన్నారు.




