calender_icon.png 17 October, 2025 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నషా ముక్త్ భారత్ లో పెయింటింగ్ పోటీలు

15-10-2025 07:37:28 PM

కరీంనగర్ (విజయక్రాంతి): నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహిళలు పిల్లలు దివ్యాంగులు & వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం జూనియర్ కళాశాలల విద్యార్థిని, విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను తెలియపరిచే విధంగా వాల్ పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. కరీంనగర్ పోలీస్ కమీషనర్ కార్యాలయ కాంపౌండ్ గోడపై విద్యార్థులు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే సమస్యలను తమ పెయింటింగ్ ద్వారా వివరించారు. వివిధ కళాశాలలకు చెందిన 17 మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఎన్ ఎం బి ఏ కమిటీ సభ్యులు పెండ్యాల కేశవరెడ్డి, మర్రి రాజేందర్, జూనియర్ కాలేజీ, కార్యాలయ సిబ్బంది పోటీలను పర్యవేక్షించారు.