15 August, 2026 | 10:41 AM

మన అణ్వాయుధాలు 172!

18-06-2024 01:25 AM
  • పాకిస్థాన్‌కంటే రెండు ఎక్కువ

భారీగా పెంచుకొంటున్న  చైనా

98 శాతం అమెరికా, రష్యా వద్దనే

ఇంటర్నేషనల్ పీస్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడి

న్యూఢిల్లీ, జూన్ 17: ప్రపంచంలోని 9 అణ్వాయుధ దేశాలు ఈ మహా వినాశకర ఆయుధాలను భారీగా పెంచుకొంటున్నాయని తేలింది. సంఖ్యను పెంచుకొంటూ, పాతవాటిని కొత్త టెక్నాలజీతో అభివృద్ధి చేసుకొంటున్నాయని స్టాక్‌హోం కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) ప్రకటించింది. భూమిపై ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయన్న అంశంపై ఈ సంస్థ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో భారత్‌కు సంబంధించిన ఆసక్తికర సమాచారం కూడా ఉన్నది. 

వార్‌హెడ్లు పెంచుకొన్న భారత్

భూమిపై దాదాపు 200 దేశాలుండగా, వాటిలో 9 దేశాల వద్ద మాత్రమే అణ్వాయుధాలున్నాయి. అమెరికా, రష్యా, చైనా, బ్రిట న్, ఫ్రాన్స్, ఇండియా, పాకిస్థాన్, ఉత్తరకొరియా, ఇజ్రాయెల్‌కు మాత్రమే అణ్వాయు ధాలు ఉన్నాయి. అయితే, మొత్తం అణ్వాయుధాల్లో 98 శాతం అమెరికా, రష్యా వద్ద నే ఉన్నాయని సిప్రి నివేదిక వెల్లడించింది. రెండేండ్లుగా కొనసాగుతున్న రష్యా యుద్ధం, తాజాగా ఇజ్రాయె యుద్ధం వంటి పరిణామాలతో చాలాదేశాలు అణ్వాయుధాలను పెంచుకొంటూ పోతున్నాయని నివేదికలో వెల్లడైంది.

గతం లో భారత్‌కంటే పాకిస్థాన్ వద్ద అణు వార్‌హెడ్లు అధికంగా ఉండేవి. తాజాగా భారత్ మళ్లీ ముందు వరుసలోకి వచ్చింది. భారత్ వద్ద ప్రస్తుతం 172 అణు వార్‌హెడ్లు ఉన్నాయని సిప్రి వెల్లడించింది. పాకిస్థాన్ వద్ద 170 ఉన్నట్టు పేర్కొన్నది. అత్యంత వేగంగా అణ్వాయుధాలు పెంచుకొంటున్న దేశంగా చైనా నిలిచింది. ఈ దేశం వద్ధ 2023 జనవరిలో 410 అణు వార్‌హెడ్లు ఉండగా, 2024 జనవరి నాటికి 500కు పెంచుకొన్నదని సిప్రి నివేదికలో తెలిపింది. 

ఎప్పుడైనా ప్రయోగించేలా 2,100 వార్‌హెడ్లు

గతంలో అణ్వాయుధాలు ఉ న్నా.. చాలావరకు దేశాలు ఎక్కడో రహస్యంగా దాచిపెట్టుకొనేవి. కానీ, గత రెండేండ్లలో అన్ని దేశాలు తమ వార్‌హెడ్లను ఎప్పుడైనా ప్రయోగించేలా బాలిస్టిక్ క్షిపణులకు అమర్చి సిద్ధంగా పెట్టుకొన్నాయని సిప్రి వెల్లడించింది. ఇలా రెడీ టు ఫైర్ పొజిషన్‌లో ఏకంగా 2,100 అణు వార్‌హెడ్లు ఉన్నాయని తెలిపింది. ఆధునిక కాలానికి తగ్గట్టుగా అన్ని దేశాలు తమ అణ్వాయుధాలను కొత్త టెక్నాలజీతో అభివృద్ధి చేసుకొంటున్నాయని సిప్రి నివేదికలో వెల్లడించిందివెల్లడించింది.