4 June, 2026 | 1:35 AM

జనాభాకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి

04-06-2026 12:00 AM
  1. బీసీల రాజకీయ సాధికారతే నిజమైన ప్రజాస్వామ్యం
  2. మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు 
  3. ఏపీలోని విజయవాడలో ‘బహుజన పాట

అమరావతి, జూన్ 3 (విజయక్రాంతి): రాష్ట్ర జనాభా లో అత్యధిక శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రైస్తవ వర్గాలకు రాజకీయ అధికారంలో తగిన భాగస్వామ్యం లభించకపోవడం ప్రజాస్వామ్యానికి సవాలుగా మారిందని మాజీ డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. జనాభా నిర్మాణాన్ని ప్రతిబింబించే రాజకీయ ప్రాతినిధ్యం ఏర్పడినప్పుడే ప్రజాస్వామ్యం సార్థకమవుతుందని ఆయన అన్నారు.

ఏపీలోని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించిన “బహుజన పాట-మా ట” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో సుమారు 56 శాతం ఉన్న బీసీలకు కేవలం 40 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటం, 19 శాతం జనాభా కలిగిన ఎస్సీలకు 29 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రాతినిధ్యం వహించ డం, 8 శాతం జనాభా ఉన్న ముస్లింలకు కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటం, 6 శాతం జనాభా కలిగిన ఎస్టీలకు ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటం ఆందోళన కలిగించే విషయమన్నారు.

సుమారు 5 శాతం జనా భా కలిగిన రెడ్డి సామాజిక వర్గానికి 32 మంది ఎమ్మెల్యే లు, 3 శాతం జనాభా కలిగిన కమ్మ సామాజిక వర్గానికి 35 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీ చిరంజీవులు (విశ్రాంత ఐఏఎస్), శామ్యూల్ ఆనంద్ (విశ్రాంత ఐఏఎస్), మాజీ ఎమ్మెల్యేలు లేక్ రాజారావు, చందా లింగయ్యదొర, సంగెం సూర్యారావు (బీసీ టైమ్స్), వీరవెల్లి శ్రీనివాస్ (బీసీ చైతన్య వేదిక), పారజ్యోతి, రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు నారగోని ప్రసంగించారు.