calender_icon.png 12 September, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూలిన ఆదిలాబాద్ కలెక్టర్ భవనం!

12-09-2025 01:17:58 AM

-శిథిలావస్థలో నిజాం కాలం నాటి బిల్డింగ్

-భారీ వర్షాలకు తడిసి, కూలిన వైనం

-సాయంత్రం కావడంతో ఉద్యోగులకు తప్పిన ప్రమాదం

ఆదిలాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయ భవనంలోని ఓ భాగం గురువారం రాత్రి కూలిపోయింది. నిజాం కాలంలో నిర్మించిన భవనం కావడంతో శిథిలావస్థకు చేరింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు తడిసి ఏవో ఛాంబర్ పక్క గది పైకప్పు కూలిపోయింది.

ఉద్యోగులు అందరూ విధులు ముగించుకుని వెళ్లిన తర్వాత సాయంత్రం సమయంలో కూలడంతో పెను ప్రమాదం తప్పింది. అంతేకాకుండా గురువారం మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా పర్యటనలో భాగంగా అధికారులతో సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించడంతో కొందరు అధికారులు మంత్రి కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. అయితే కూలిన గది పైకప్పు కింద ఎప్పుడూ ఇద్దరు పోలీసులు విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ ప్రమాదంలో వారికి ఎలాంటి గాయాలు కాలేదు.