calender_icon.png 12 September, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వ

12-09-2025 01:17:28 AM

సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

హుజూర్ నగర్, సెప్టెంబర్ 11: సూర్యాపేట జిల్లాలో యూరియా సరిపోను ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని   సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.గురువారం హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలలో పలు ఎత్తిపోతల పథకాలు, ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..

రైతులు ఎంత అవసరం ఉంటే అంతే యూరియాను తీసుకోవాలని ముందస్తుగా తీసుకొని నిల్వ చేసుకోవద్దని రైతులకు సూచించారు. నేడు సూర్యాపేట జిల్లాకు వ్యాగన్ యూరియా వచ్చిందని వాటిని వ్యవసాయ అధికారుల ద్వారా జిల్లాలో పిఏసిఎస్, ఆగ్రో సెంటర్ లకు సరఫరా చేసి రైతులకు పంపిణి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

హుజూర్ నగర్, కోదాడ నియోజక వర్గాలలో ఎత్తిపోతల పథకాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో నిర్మిస్తున్న రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్, వెల్లటూరు వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిప్ట్ ఇరిగేషన్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఇటీవల హైదరాబాద్ లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబందించిన ఇరిగేషన్ ప్రాజెక్టు ల పురోగతిపై రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి వేగవంతంగా పనులు పూర్తి అయ్యేలా చూడాలని ఆదేశించారని తెలిపారు.

వెల్లటూరు గ్రామంలో  ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ కు సంబంధించి అక్కడక్కడ భూసేకరణకు సంబంధించి టైటిల్, సరిహద్దులు,అటవి శాఖ వివాదాలు ఉన్నాయని వాటిని  క్షేత్ర స్థాయిలో పరిశీలించటం జరిగిందన్నారు. అనంతరం చింతలపాలెం మండల కేంద్రంలో అలాగే, కోదాడ మండలంలోని నల్లబండగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.

పదవ తరగతిలో జరుగుతున్న సైన్స్ క్లాసు సందర్శించి విద్యార్థుల యొక్క నోట్ బుక్స్ ను పరిశీలించి నిజ జీవితంలో ఉపయోగపడే వాటి బేసిక్ కెమికల్ ఫార్ములాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలు ఎంచుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని  విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆర్డీవోలు శ్రీనివాసులు, సూర్యనారా యణ, తహసిల్దార్ సురేందర్ రెడ్డి, ఇరిగేషన్ ఈఈలు అశోక్, సత్య నారాయణ,డిఈ స్వామి, ఏఈ శ్రీనివాస్, ఎఫ్‌ఆర్‌ఓ ఆదిత్య, అధికారులు, సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.