12-09-2025 01:19:08 AM
-ఆర్టీసీ ఉద్యోగులను విస్మరిస్తున్న ప్రభుత్వం
-సింగరేణి తరహాలో ఆర్టీసీ ఉద్యోగులకు లాభాల్లో వాటా కేటాయించాలి
-సమస్యలను పరిష్కరించకపోతే బస్సు భవనం ముట్టడిస్తాం
-బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
ముషీరాబాద్, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో టీజీఎస్ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను విస్మరిస్తుందని తీవ్రంగా విమర్శించారు.
మహిళలకు ఉచిత బస్సు హామీ ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచిందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా దాదాపు 200 కోట్ల మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు. సింగరేణి తరహాలోనే ఆర్టీసీ ఉద్యో గులకు లాభాల్లో వాటాను కేటాయించాలన్నారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు గుర్తించకపోవడం విచారకరమన్నారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే బస్ భవన్‌ను ముట్టడిస్తామని, త్వరలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల మహాసభను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్టు హెచ్చరించారు.
త్వరలో జరి గే ప్రమోషన్లలో బీజీలకు రిజర్వేషన్లు కల్పించాలని, ఈడబ్ల్యూఎస్ రద్దు చేసి విద్య, ఉద్యో గాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నా రు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ ఆర్టిసి బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బం డి స్వామి, చంద్రశేఖర్, శ్యామ్ కుర్మ, హరినాథ్, లింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.