calender_icon.png 6 December, 2025 | 5:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న క్షేత్రానికి రానున్న త్రిశక్తి పీఠాధిపతులు ఆదిత్య పరాశ్రీ

06-12-2025 03:23:07 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం బిజ్వార్ గ్రామంలోని  శ్రీశ్రీశ్రీ అంబాత్రయ క్షేత్రంలోని  శ్రీకాళీ, శ్రీ సరస్వతి, శ్రీలక్ష్మి అమ్మవార్లను శనివారం అయ్యప్ప స్వామి భక్తులతో కలిసి దర్శించుకున్న సామాజిక సేవకులు గణేష్ తివారి అనంతరం త్రిశక్తి పీఠం పీఠాధిపతులు డాక్టర్ ఆదిత్య పరాశ్రీ  స్వామి వారిని కలిసి కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయానికి, చేర్యాల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయానికి రావాలని కోరగా సానుకూలంగా స్పందించిన డాక్టర్ ఆదిత్య పరాశ్రీ వారు త్వరలోనే కొమురవెల్లికి, చేర్యాల అయ్యప్ప స్వామి ఆలయానికి వస్తానని ప్రకటించారు. కొమురవేల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చేర్యాల మండలకేంద్రంలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయానికి  చేరుకొని స్వామివారి దర్శనం అనంతరం ఆదిత్య పరాశ్రీ స్వామి వారు భక్తులతో మాట్లాడుతారని తెలిపారు.