06-12-2025 04:23:17 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): అనారోగ్యంతో మరణించిన స్నేహితుడి కుటుంబానికి క్లాస్‌మేట్స్ 24,500 రూపాయలు అందజేసి అండగా నిలిచారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పరిధిలోని దనసరికి చెందిన పట్ల వెంకన్న అనారోగ్యానికి గురై కొద్దిరోజుల క్రితం మరణించాడు. ఆయన కుటుంబానికి వెంకన్నతో కేసముద్రం స్టేషన్ హై స్కూల్ లో పదో తరగతి వరకు కలిసి చదువుకున్న 1993 1994 టెన్త్ బ్యాచ్ విద్యార్థులు 24,500 రూపాయలు అందించి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో నల్ల తీగల రవి, రామడుగు ధర్మాచారి, వీరభద్ర చారి, కమటం స్వామి, కర్ణాకర్, వీరారెడ్డి, మహేందర్, శంకర్, శ్రీనివాస్, ప్రభురాణి పాల్గొన్నారు.