9 July, 2026 | 6:50 PM

యువజన సంఘం బలోపేతంకై యువత నడుం బిగించాలి

09-07-2026 05:55 PM

కొత్తపల్లి, జూలై 09(విజయక్రాంతి): అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ కరీంనగర్ నగర 14 వ మహాసభ నగర అధ్యక్షులు చెంచల మురళి అధ్యక్షతన బద్దo ఎల్లారెడ్డి భవన్లో జరిగింది.మహాసభల సందర్భంగా ఏర్పాటుచేసిన ఏఐవైఎఫ్ పతాకాన్ని రాష్ట్ర సహాయ కార్యదర్శి బావoడ్ల పల్లి యుగంధర్ ఎగరవేశారు. ఈ మహాసభకు ముఖ్య అతిధి హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో యువజనులు ఎదుర్కొంటున్న సమస్యల పైన పోరాడేందుకు, హక్కులను సాధించుకునేందుకు యువతి, యువకులను ఐక్యపరిచి 1953 మే 3వ తేదీన ఆవిర్భవించబడిందని నాటి నుండి నేటి వరకు యువజన హక్కుల సాధనేద్యేయంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు.

18 సంవత్సరాల నిండిన యువతకు ఓటు హక్కు కల్పించాలని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్రలు చేసి ఓటు హక్కు కల్పించిన ఘనత ఒక ఏఐవైఎఫ్ కి దక్కింది అన్నారు. దేశ భవిష్యత్తు యువత పైనే ఆధారపడి ఉందని ఈ దేశంలో కోట్లాదిమంది యువత విద్య, ఉపాధి అవకాశాలు లేక ఉన్నత చదువులు చదివి అనేక ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆయన విమర్శించారు.కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని గత 12 సంవత్సరాల క్రితం చెప్పిందని కానీ నేటికీ 12సంవత్సరాలు అయినా కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామన్నారని జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రతి ఏటా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేసిందని ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ కూడా పూర్తిగా మాట తప్పిందని పేర్కొన్నారు. వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలని పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.తదుపరి ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భావండ్ల పెళ్లి యుగంధర్ మాట్లాడుతూ యువతకు ఎన్నికల సమయంలో యువతకు హామీలు ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 13వ తేదీన ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా మహాసభలు నిర్వహించడం జరుగుతుందని నగరం నుండి యువత పెద్ద ఎత్తున తరలివచ్చి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని నగర కార్యకర్తలకు యుగంధర్  పిలుపునిచ్చారు.

ఈ మహాసభలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు ఎన్ఎఫ్ఐడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు బీర్ల పద్మ, ఏఐవైఎఫ్ నాయకులు కసిబోజుల సంతోషి చారి, కాల్వ శ్రీనివాస్ యాదవ్,మేకల రమ, సంపత్ నాయక్, జువ్వాడి తిరుపతి, హేమంత్,శ్రావణ్,బిర్లా స్వాతి, ఉదయ భాస్కర్,అరవింద్ పూజ, వినయ్,నునావత్ శ్రీనివాస్,జహంగీర్, అంజయ్య, బోయిని విష్ణు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.