19 April, 2026 | 11:06 AM

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

10-05-2025 10:21 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉండడంతోపాటు కళాశాలలో పిఎబిఎస్సి కంప్యూటర్ లైఫ్ సైన్స్ బీకాం తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కళాశాల న్యాక్ ఏ గ్రేడ్ సాధించి 10 సంవత్సరాలు అటానమాస్ హోదా కలిగి ఉందని ఆయన తెలిపారు. డిగ్రీలో అడ్మిషన్ ఉండేందుకు ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన దోస్త్ ఆన్లైన్లో  విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.