10-05-2025 10:18:19 PM
మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ బండివార్ పరుశురాం మిలటరీ ఉన్నత అధికారుల ఆదేశాలతో శుక్రవారం హుటాహుటిన విధుల్లో చేరేందుకు తరలివెళ్లారు. భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో అత్యవసర పరిస్థితులతో విధుల్లోకి చేరినట్లు పరుశురాం కుటుంబ సభ్యులు తెలిపారు. పరు శురాం ఈ నెల 2న మద్నూరు సెలవులపై వచ్చాడని, ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు ఉండగా హఠాత్తుగా బయలుదేరి వెళ్లినట్లు వారు తెలిపారు.