10-05-2025 10:23:31 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు నతనడక నడుస్తున్నాయని త్వరగా పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత పాటించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ్ సహాయం రఘురామిరెడ్డి ఆదేశించారు. కొత్తగూడెం పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం రైల్వే స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకి , రైల్వే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా రైల్వే స్టేషన్ లో అన్ని రకాల సౌకర్యాలతో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు.
కరోనాలో రద్దు చేసినటువంటి రైళ్లు అన్నింటిని తక్షణం పునరుద్ధరణ చేయాలని, కోవూరు రైల్వే లైన్ పనులు, డోర్నకల్ నుంచి కొత్తగూడెం వరకు నడుస్తున్న డబ్లింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని, కొత్తగూడెం రైల్వే స్టేషన్లో మూడవ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని, కాకతీయ ట్రైన్ మణుగూరు వరకు పొడిగించి నడిపించాలన్నారు., కొత్తగూడెం నుండి తిరుపతికి , శిరిడీకి ప్రత్యేక రైలు నడపాలని, తదితర రైల్వే సమస్యలను సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మేనేజర్ తో ఫోన్లో మాట్లాడి త్వరగా రైల్వే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, ఆళ్ళ మురళి, ఊకంటి గోపాలరావు, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు డి ఆర్ యు సి సి మెంబర్ వైస్ శ్రీనివాసరెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్, ఐఎన్టీయూసీ నాయకులు రజాక్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు విజయ భాయ్, హైమావతి, కేకే శ్రీనివాస్, రావి రాంబాబు, తలువు అనిల్, జయప్రకాష్, బాల ప్రసాద్, సాయి, కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ నాయకులు తైతాలు పాల్గొన్నారు