09-05-2025 11:49:07 PM
ఈనెల 16న స్పాట్ కౌన్సిలింగ్
హుస్నాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ మమత తెలిపారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. సిరిసిల్ల, వేములవాడ, హుస్నాబాద్, మంథనిలోని కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో వివిధ గ్రూపుల్లో సీట్లు ఉన్నాయన్నారు.
సిరిసిల్లలో ఎంపీసీ, బైపీసీ, ఏఅండ్ టీ గ్రూపులలోనూ, మానాల (వేములవాడ), అక్కనపేట (హుస్నాబాద్), మంథని కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తి గల గిరిజన, గిరిజనేతర బాలికలు ఈనెల 16న సిరిసిల్లలోని సారంపల్లిలో గల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో జరిగే కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలు, ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాల కోసం 8333925362 కు ఫోన్ చేయవచ్చన్నారు.