09-05-2025 11:45:41 PM
ప్రజలు సహకరించాలి
సిద్దిపేట (విజయక్రాంతి): దుబ్బాక మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో శనివారం 10న విద్యుత్ అంతరాయం జరుగుతుందని డి. ఈ గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హబ్సిపూర్132/33 కె.వి సబ్ స్టేషన్ లో మెయింటెనెన్స్ కారణంగా దుబ్బాక పట్టణంతోపాటు అక్బర్ పేట భూంపల్లి మండలంలోని పోతరెడ్డి పేట, నగరం, చిట్టాపూర్, ఏనగుర్తి, బొప్పాపూర్, కూడవెళ్లి, చిన్న నిజాంపేట్, రామేశ్వరం పల్లి, తాళ్లపల్లి, చౌదర్పల్లి, మిడిదొడ్డి మండలం ధర్మారం, కొండాపూర్, అందే, కసులాబాద్ గ్రామాలకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరయం కలుగుతుందని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు తమకు సహకరించాలని కోరారు.