11-05-2025 11:45:28 AM
హైదరాబాద్: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఎప్‌సెట్ ఫలితాలను నేరుగా విద్యార్థులు సెల్ ఫోన్ కే వచ్చేలా ఏర్పాట్ల చేశారు. ఇంజినీరింగ్, ఫార్మ, అగ్రికల్చర్ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఎప్ సెట్ పరీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 29,30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా, ఈ నెల 2,3,4 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు పూర్తిచేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 2.07 లక్షల మంది విద్యార్థులు పరీక్ష హాజరుకాగా, ఫార్మా, అగ్రికల్చర్ విభాగంలో 81,198 లక్షల మంది పరీక్షలు రాశారు.
ఎప్‌సెట్ ఇంజినీరింగ్ లో పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడకు చెందిన పల్లా భరత్ చంద్రకు మొదటి ర్యాంక్ దక్కంది. ఇంజినీరింగ్ లో రంగారెడ్డి జిల్లా మాదాపూర్ కు చెందిన ఉదగండ్ల రామచరణ్ రెడ్డి రెండో ర్యాంకు సాధించాడు. ఇంజినీరింగ్ లో విజయనగరం జిల్లాకు చెందిన హేమసాయి సూర్యకార్తీక్ కు మూడో ర్యాంకు వచ్చింది. ఇంజినీరింగ్ లో నాచారంకు చెందిన మెండె లక్ష్మీభార్గవ్ నాలుగో ర్యాంకు సాధించాడు. ఇంజినీరింగ్ లో మాదాపూర్ కు చెందిన మంత్రిరెడ్డి వెంకట గణేశ్ రాయల్ ఐదో ర్యాంకు దక్కింది. ఇంజినీరింగ్ లో సుంకర సాయి రిశాంత్ రెడ్డి(మాదాపూర్)కి ఆరో ర్యాంకు, రష్మిత్ బండారి(మాదాపూర్)కి ఏడో ర్యాంకు, బనిబ్రత మాజీ(బడంగ్ పేట్)కి ఎనిమిదో ర్యాంకు, కొత్త ధనుష్ రెడ్డి(హైదరాబాద్)కి 9వ ర్యాంకు, కొమ్మ శ్రీకార్తీక్ (మేడ్చల్)కు పదో ర్యాంకు వచ్చింది.అగ్రికల్చర్, ఫార్మా ఫలితాల్లో సాకేత్ రెడ్డి(మేడ్చల్)కు మొదటి ర్యాంకు, సబ్బాని లలిత్ వరేణ్య(కరీంనగర్)కు రెండో ర్యాంకు, అక్షిత్(వరంగల్)కు మూడో ర్యాంకు వచ్చింది. ఈ సారి అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో అబ్బాలదే పై చేయి. మొదటి పది ర్యాంకుల్లో కేవలం ఒక్క విద్యార్థిని ఉండటం విశేషం.