11-05-2025 11:47:56 AM
15 న బాలురు, 16న బాలికలకు ఏటూరు నాగారంలో అడ్మిషన్ల ప్రక్రియ
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) రీజియన్ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బాలురు, బాలికల గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో నేరుగా అడ్మిషన్ల కొరకు ఈనెల 15, 16 తేదీల్లో ఏటూరునాగారంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా, ఆర్ సి ఓ హరి సింగ్ తెలిపారు. 15వ తేదీన ఏటూరు నాగారంలోని స్పోర్ట్స్ స్కూల్లో ఉదయం 10 గంటలకు బాలురకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే 16వ తేదీన ఈటూర్ నాగారం ఆర్ జె సి లో బాలికలకు అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా తేదీల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశం కోసం వచ్చే విద్యార్థులు తమ యొక్క ఎస్.ఎస్.సీ మెమో, టీసీ, స్టడీ, కులం, ఆదాయం, ఆధార్ కార్డు ఒరిజినల్స్ తోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, నాలుగు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు వెంట తెచ్చుకోవాలని సూచించారు. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లా రీజియన్ పరిధిలో ఇంటర్మీడియట్ కళాశాలల వివరాలు ఇలా ఉన్నాయి.
బాలురు: కాటారం (ఎంపీసీ, బైపిసి), ఏటూరు నాగారం (ఎంపీసీ, బైపిసి, సిఇసి, హెచ్ఈసి), ములుగు (ఎంపీసీ, బైపీసీ), దామరవంచ (ఎంపీసీ, బైపిసి), మహబూబాబాద్ (ఎంపీసీ, బైపిసి), మరిపెడ (ఎంపీసీ, బైపిసి), రెడ్యాల (సిఈసి, హెచ్ ఇ సి), అలాగే బాలికల కు కాటారం (ఎంపీసీ, బైపిసి), ఏటూరునాగారం (ఎంపీసీ, బైపీసీ, సీఈసీ), వెంకటాపురం (ఎంపీసీ, బైపిసి), కొత్తగూడ (ఎంపీసీ, బైపిసి), కేసముద్రం (సిఈసి, హెచ్ఈసి), మహబూబాబాద్ (ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రవేశం పొందవచ్చని తెలిపారు. ఆయా కళాశాలలో ఒక్కో గ్రూపులో ఎస్టీ కేటగిరి విద్యార్థులతో పాటు ఎస్సీ 1, బీసీ 1, ఓసి 1, అర్ఫాన్ 1, స్పోర్ట్స్ 1, పీహెచ్ సి 1 చొప్పున సీట్లు కేటాయించబడతాయని గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలల రీజినల్ కోఆర్డినేటర్ హరి సింగ్ తెలిపారు.