calender_icon.png 12 May, 2025 | 9:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ సాయుధ బలగాలకు సెల్యూట్

10-05-2025 12:00:00 AM

  1. ఎమ్మెల్యే ముఠా గోపాల్

భోలక్పూర్‌లో బీఆర్‌ఎస్ నేతల ఆపరేషన్ సిందూర్ విజయోత్సవ భారీ ర్యాలీ

పెద్ద సంఖ్యలో పాల్గొన్న మైనార్టీలు

ముషీరాబాద్, మే 9 (విజయక్రాంతి) : పాకి స్తాన్ సైనికులు భారత దేశంపై చేస్తున్న దాడులను దేశ సాయుధ బలగాలు తిప్పికొట్టి వారికి తగిన గుణపాఠం చెప్పారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. శుక్రవారం భోలక్పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్య క్షుడు వై.శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ 2, పాకిస్తాన్ ఉగ్రవాద స్థావ రాలపై భారత సైనికులు జరిపిన దాడి ని హర్షిస్తూ డివిజన్ లోని బిలాల్ మసీదు నుంచి ఇందిరానగర్ వరకు జాతీయ జెండాలను చేతబూని భారీ ర్యాలీని నిర్వహిం చారు. ఈ ర్యాలీలో ముస్లిం మైనార్టీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో పాటు బీఆర్‌ఎస్ నేతలు జాతీ య జెండాను చేతబట్టి సైనికులకు మద్దతుగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ... పాకిస్తాన్ సైనికులు డ్రోన్లతో దేశంలో  వి ధ్వంసం  సృష్టించాలని ప్రయత్నిస్తే దేశ సైనికులు వారి ఎత్తుగడలకు బుద్ది చెప్పి వాటిని ధ్వంసం చేసి తగిన గుణపాఠం చెప్పారన్నా రు. భారత దేశం చేస్తున్న న్యాయమైన పోరాటానికి ప్రపంచంలోని అన్ని దేశాలు సం పూర్ణ మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నారు. సైన్యం త్యాగాలను దేశ ప్రజలు ఎన్నటికి మర్చిపోలేరని, సైన్యానికి ప్రజలంతా రుణపడి ఉంటారని అన్నారు.

ఏపీ రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ త్యాగాలను మర్చిపోలేమని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రాగాఢ సానుభూతి తెలిపారు. భారత్ పాకిస్తాన్ దేశాల యుద్ధం సందర్భంగా కులమ తాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి భారత సైన్యానికి అండగా నిలవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువజన విభా గం నగర నాయ కుడు ముఠా జైసింహ, రాష్ట్ర నాయకులు రహీం, షరీఫ్, డివిజన్ ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్, చాంద్ పాషా, పార్టీ నాయకులు కె. మాధవ్, శ్యామసుందర్, మహేష్, కృష్ణ, ప్రవీణ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.