27 August, 2026 | 1:53 AM

అడల్ట్ వ్యాక్సినేషన్ సెంటర్‌కు మూడేళ్లు

27-08-2026 12:47 AM

కాంటినెంట్ హాస్పిటల్‌లో ఏర్పాటైన కేంద్రం

వ్యాక్సిన్లు ప్రాణనష్టాన్ని 80 శాతానికి పైగా తగ్గిస్తాయి   

డాక్టర్ వరప్రసాద్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): వయోజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాంటినెంటల్ హాస్పిటల్స్(Continental Hospitals) అడల్ట్ వ్యాక్సినేషన్ సెంటర్ మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కాంటినెంటల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత్లో అడల్ట్ ఇమ్యూనైజేషన్, ప్రివెంటివ్ హెలేకేర్‌ను మరింత బలోపేతం చేయాలనే తమ నిబద్ధతను ఆసుపత్రి పునరుద్ఘాటించింది.

శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకులు, చైర్మన్, ప్రముఖ బయోటెక్నాలజీ నిపుణులు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వైద్యులు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. వ్యాధుల నివారణలో టీకాలు అత్యంత కీలకమైనవని అన్నారు. వ్యాక్సిన్లు కేవలం వ్యాధి తీవ్రతను తగ్గించడమే కాకుండా, ప్రాణనష్టాన్ని 80 శాతానికి పైగా తగ్గిస్తాయి. వేలాది మంది వయోజనులకు టీకాలు అం దించేందుకు కాంటినెంటల్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ గురు ఎన్. రెడ్డి తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు. 

కాంటినెంటల్ హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ గురు ఎన్. రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో పిల్లల వ్యాక్సినేషన్ కార్యక్ర మం 80 శాతానికిపైగా విజయవంతంగా కొనసాగుతున్నప్పటికీ, వయోజనుల్లో మార్గదర్శకాల ప్రకారం టీకాలు తీసుకుంటున్న వారి సంఖ్య కేవలం 2 శాతం మాత్రమేనని తెలిపారు. న్యుమోనియా,ఇన్ఫ్లూఎంజా, హెర్పెస్ జోస్టర్, హెపటైటిస్, కొన్ని రకాల క్యాన్సర్ల వంటి వ్యాధుల నివారణకు వయోజనులు కూడా టీకాలను తప్పనిసరిగా పరిగణించాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా కాంటినెంటల్ హాస్పిటల్స్ అడల్ట్ వ్యాక్సినేష న్ సెంటర్ ద్వారా గత మూడేళ్లలో 25వేల కుకు పైగా వ్యాక్సిన్ డోసులు అందించగా, 12వేలకు మందికి పైగా వయోజనులు ఇన్‌ఫ్లూఎంజా, టైఫాయిడ్, హెపటైటిస్ బి తదితర వ్యాధుల నుంచి రక్షణ పొందారు.