27 August, 2026 | 1:15 AM

అరచేతిలో లైబ్రరీ

27-08-2026 12:00 AM
  1.   70 భాషల్లో 68 లక్షల డిజిటల్ పుస్తకాలు 
  2.  ప్రాథమిక స్థాయి నుంచి పీజీ వరకు 
  3. ఆండ్రాయిడ్ ఐఓఎస్‌తో పనిచేసే అన్ని స్మార్ట్ ఫోన్లలో లభ్యం 
  4.  విద్యార్థులకు ఎంతో ఉపయోగం అంటున్న ఉపాధ్యాయులు 

 ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో..కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో‘ అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు. ఇప్పుడు కొనుక్కోకుండానే మంచి పుస్తకాలు దొరు కుతున్నాయి.అదెలా అంటే ఇప్పుడు సెంట్ర ల్ గవర్నమెంట్ డిజిటల్ లైబ్రరీ యాప్ ను డెవలప్ చేసింది.అందులో 70 భాషల్లో, 68లక్షల డిజిటల్ పుస్తకాలు ఉన్నాయి.

 జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఆగస్టు 25: లైబ్రరీలు విజ్ఞాన భాండాగారాలు అంటారు. వాటిలో ఎవరికి కావాల్సిన జ్ఞానం వాళ్లకు దొరుకుతుంది.మరి లైబ్రరీలు అందుబాటులో లేని వాళ్ళు,పుస్తకాలు కొనే స్తోమత లేని వాళ్ళ పరిస్థితి ఏంటి?? వాళ్లకోసమే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా లక్షలాది పుస్తకాలు ఇంట్లోనే ఉండి చదువుకునే అవకాశం వచ్చిందిప్పు డు.అదెలా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఐఐటీ ఖరగ్ పూర్ సహకారంతో డిజిటల్ లైబ్రరీ ఆ ఫ్ ఇండియా పేరుతో వ్బుసైట్ రూ పొందించింది.

అందులో ప్రాథమిక స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు అన్ని రకా ల పుస్తకాలు ఉన్నాయి.ఈ లైబ్రరీలో హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లతో కలిపి మొత్తం 70భాషల్లో 60లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయి.. మూడు లక్షల మంది రైటర్లు రాసిన 10 లక్ష ల పుస్తకాలు,రెండు లక్షల మంది రచయితల మూడు లక్షల కథలు,262 ఆడియో కథలు ,18 వేలకు పైగా వీడియో కథనాలు ఉన్నా యి. వ్యవసాయం,కంప్యూటర్ సైన్స్,ఐటీ జనరల్,ఫిలాసఫీ,సైకాలజీ తదితర అంశాలకు సంబంధించిన ఎన్నో విషయాలతో పాటు ఎంద రో మహానుభావులు రాసిన లక్షణ పుస్తకాలు ఈ లైబ్రరీలో ఉన్నాయి.

 ఆండ్రాయిడ్ మొబైల్ లో.. 

 వెబ్ సైట్ తో పాటు యాప్ ను కూడా డెవలప్ చేశారు.ఇది ఆండ్రాయిడ్ ఐఓఎస్ తో పనిచేసే అన్ని స్మార్ట్ ఫోన్లలో పనిచేస్తుంది. ప్లే స్టోర్ లోకి వెళ్లి నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అని సెర్చ్ చేయగానే యాప్ కనిపిస్తుంది.దాన్ని ఇన్స్టాల్ చేసుకుం టే సరిపోతుంది.లక్షల పుస్తకాలు చదివేయవచ్చు.

కాకపోతే దానికోసం మీ వ్యక్తిగత వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.పేరు ఈ-మెయిల్ ఎంటర్ చేసి పాస్ వర్డ్ సెట్ చేసుకోవాలి.తర్వాత మెయిల్ కు ఒక కన్ఫర్మేషన్ లింక్ వస్తుంది.దానిపై క్లిక్ చేస్తే చాలు తర్వాత ఎప్పుడైనా లాగిన్ అయ్యి కావలసిన పుస్తకాలు చదువుకోవచ్చు.అంతేకాదు ఈ పుస్తకా లను అందుబాటులో ఉన్న ఫార్మాట్ లలో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.

 విద్యార్థులకు ఎంతో ఉపయోగం

 మండలంలోని చాలా ఊళ్ళల్లో లైబ్రరీలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.మండల కేంద్రానికి వెళ్లి లైబ్రరీలో పుస్తకాలు చదవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది.కానీ.. ఈ యాప్ ద్వారా విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంది.స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఏ పుస్తకమైనా చదువుకోవచ్చు.

నల్లగంటి వెంకన్న, 

ఉపాధ్యాయుడు, అర్వపల్లి మండలం