వర్షాకాలం దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలి
మహేశ్వరం, మే 28 : రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధి ఉస్మాన్ సాగర్ కాలనీలో మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్‌తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కాలనీ ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శశాంక, జల్‌పల్లి బండ గ్‌పేట్ మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఇరిగేషన్ అధికారులు సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడు తూ.. గతంలో 2020 సంవత్సరంలో బురాన్‌ఖాన్ చెరువు పరిసర ప్రాంతాలు ముంపు నకు గురయ్యాయని గుర్తు చేశారు.
గత అనుభావాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే వర్షకాలంలో బురాన్‌ఖాన్ చెరు వు మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు సూచించారు. చెరువులో గుర్రపు డెక్కను, నాచును తొలగించాలని కోరారు. అధికారు లు ముందస్తు కార్యచరణ ప్రణాళికను తయారు చేసుకొని స్థానిక ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసు కోవాలన్నారు. దోమలు, సీజనల్ వ్యాధుల భారీన పడకుం డా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ శాఖల అధికారులకు సూచించారు.






