12 April, 2026 | 7:58 PM

కెప్టెన్‌గా రషీద్‌ఖాన్, నబీకి చోటు

01-01-2026 01:41 AM

కెప్టెన్‌గా రషీద్‌ఖాన్, నబీకి చోటు

టీ20 ప్రపంచకప్‌కు ఆప్ఘనిస్తాన్ జట్టు ప్రకటన

దుబాయి, డిసెంబర్ 31 : భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మొదలుకానుండగా.. ఒక్కొక్క దేశం తమ జట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఆప్ఘనిస్తాన్ 15 మందితో కూడిన జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కెప్టెన్‌గా రషీద్‌ఖాన్, వైస్ కెప్టెన్‌గా ఇబ్రహీం జద్రాన్‌ను ఎంపిక చేసింది. అయితే ఈ మెగాటోర్నీకి 41 ఏళ్ల మహ్మద్ నబీకి కూడా చోటు దక్కింది. కుర్రాళ్లకే ప్రాధాన్యత ఇచ్చినప్పటకీ.. సీనియర్ ప్లేయర్స్‌ను కూడా తీసుకుంది.అలాగే గుల్బదిన్ నైబ్, నవీన్ ఉల్ హక్ రీఎంట్రీ ఇచ్చారు. 20 ఏళ్ళ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ ఇషాక్ కొత్తగా జట్టులోకి వచ్చాడు.

ఉపఖండపు పిచ్‌ల దృష్ట్యా స్పిన్ ఆల్‌రౌండర్లకు ప్రాధాన్యతనిచ్చింది. ఇదిలా ఉంటే ఈ మెగాటోర్నీ కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ జట్టు వెస్టిండీస్‌తో మూడు టీ20లు ఆడనుంది. వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసిన జట్టే విండీస్‌పై సిరీస్ ఆడుతుందని ఏసీబీ తెలిపింది. టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, యూఏఈ, కెనడా జట్లతో కలిసి గ్రూప్ డిలో చోటు దక్కించుకుంది. తమ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘన్ టీమ్ ఫిబ్రవరి 8న న్యూజిలాండ్‌తో తలపడుతుంది.

టీ20 వరల్డ్‌కప్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు

రషీద్ ఖాన్ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్(వైస్ కెప్టెన్), గుర్బాజ్ (కీపర్), మహ్మద్ ఇషాక్ (కీపర్), సెదిఖుల్లా అటల్, దర్వీష్ రసూలీ, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా, నొమర్‌బదిన్‌జాయ్, గుల్బాబిబ్డిన్‌జాయ్, ఉర్ రెహమాన్, నవీన్ ఉల్ హక్, గుల్బదిన్‌జాయ్, ఫజల్ హక్ ఫరూకీ, అబ్దుల్లా అహ్మద్‌జాయ్