01-01-2026 01:40:22 AM
దంచికొట్టిన సర్ఫరాజ్ ఖాన్
విజయ్‌హజారేలో విధ్వంసం
జైపూర్, డిసెంబర్ 31 : యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ విజయ్ హజారే ట్రోఫీలో విధ్వంసం సృష్టించాడు. గోవాతో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 75 బంతుల్లోనే 157 పరు గులు బాదేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. రఘువంశీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ గోవా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్ట్రెయిట్ బౌండరీలు, లాంగాన్, డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్లు ఆడుతూ ప్రేక్షకులను అలరించాడు. అతని విధ్వంసానికి గోవా బౌ లర్లు ప్రేక్షకులయ్యారు. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను సైతం సర్ఫరాజ్ ఉతికారేశాడు. అతని దెబ్బకు అర్జున్ 8 ఓవర్ల లోనే 78 పరుగులు సమర్పించుకున్నాడు.
సర్ఫరాజ్ ఇన్నింగ్స్‌లో 120 పరుగులు బౌండరీలు, సిక్సర్ల ద్వారానే వచ్చాయి. సర్ఫరాజ్‌తో పాటు అతని సోదరుడు ముషీర్ ఖాన్ కూడా హాఫ్ సెంచరీతో మెరిసాడు. జైస్వాల్ (46), హార్థిక్ తామోర్ (53) కూడా రాణించడంతో ముంబై 50 ఓవర్లలో 8 వికెట్లకు 444 పరుగుల భారీస్కోర్ చేసింది. ఛేజింగ్‌లో గోవా కూడా పోరాడినా 357 పరుగులే చేయగలిగింది. అభినవ్ సెంచరీ చేయగా.. ముంబై బౌలర్లలో శార్థూల్ ఠాకూ ర్ 3 , జైస్వాల్ 2 వికెట్లు తీసారు. కాగా గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్ నిలకడగా రాణిస్తున్నా జాతీయ జట్టు కూర్పులో అతనికి చోటు దక్కడం లేదు. ఇ ప్పుడు కివీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లోనైనా అ తనికి సెలక్టర్లు పిలుపునిస్తారేమో చూడాలి.