calender_icon.png 1 January, 2026 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

3న భారత జట్టు ఎంపిక

01-01-2026 01:44:55 AM

ముంబై, డిసెంబర్ 31 : న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టును జనవరి 3న ఎంపిక చేయనున్నారు. దీని కోసం చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సారథ్యంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశం కానుంది. ఈ సిరీస్ కు కోసం ఎంపిక చేసే జట్టులో పలు కీలక మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.  టీ20 ప్రపంచకప్ దృష్ట్యా బుమ్రా, పాండ్యాలకు రెస్ట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

అదే సమయంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు చోటు దక్కడం అనుమానంగానే మారింది. పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ వైపు సెలక్టర్లు మొగ్గుచూపే అవకాశముంది. ఇదిలా ఉంటే మెడనొప్పి నుంచి కోలుకున్న శుభమన్ గిల్ తిరిగి వన్డే జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. అటు శ్రేయాస్ అయ్యర్ ఫిట్ నెస్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ నుంచి శ్రేయాస్ కు ఇంకా క్లియరెన్స్ సర్టిఫికేట్ రాలేదు.