1 July, 2026 | 7:49 PM

Breaking News

బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •  

కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రపంజా

15-08-2024 12:50 AM
  1. దోడా జిల్లాలో భీకర ఎన్‌కౌంటర్
  2. సైనిక కమాండర్ వీరమరణం
  3. ఒక ఉగ్రవాదిని కాల్చి చంపిన సైన్యం
  4. రక్షణ మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష

శ్రీనగర్, ఆగస్టు 14: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరారు. దోడా జిల్లాలో సోదాలు నిర్వహిస్తున్న బలగాలపై అత్యాధునిక తుపాకులతో విరుచుకుప డటంతో వారిని తిప్పికొట్టే క్రమంలో ఓ సైనిక కమాండర్ వీరమర ణం పొందాడు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాదిని సైన్యం మట్టుబెట్టింది. ఘటనా స్థలం నుంచి అత్యాధునిక ఎం4 రైఫిల్‌తోపాటు కిట్‌బ్యాగులు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకొన్నారు. 

కెప్టెన్ డీపక్ సింగ్ వీరమరణం

దోడా జిల్లాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందుకొన్న 48 రాష్ట్రీ య రైఫిల్స్ విభాగం కెప్టెన్ దీపక్ సింగ్ నేతృత్వంలో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. అస్సర్ ప్రాంతంలోని దట్టమైన అడవిలో ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు మొదలుపెట్టారు. వెంటనే సైనికులు ఎదురుకాల్పులు ప్రారంభించటంతో కొద్దిసేపు భీకర కాల్పు లు చోటుచేసుకొన్నాయి. సైనిక బలగాలకు నేతృత్వం వహిస్తున్న దీపక్ సింగ్ ముందుం డి ఉగ్రవాదులను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన అమరుడయ్యారని రక్షణ శాఖ ప్రకటించింది. ఎన్‌కౌంటర్‌లో ఒక ముష్కరుడిని మట్టుబెట్టామని, మరో నలుగరు ఉగ్రవాదులు గాయపడినట్టు అక్కడ రక్తపు మరకలను బట్టి అంచనాకు వచ్చారు. వారికోసం గాలింపు కొనసాగుతున్నది.