1 July, 2026 | 6:35 PM

Breaking News

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •  

ప్రేమ శిల్పం

15-08-2024 12:48 AM

భార్యకు జుకర్‌బర్గ్ అపూర్వ కానుక

అమెరికా, ఆగస్టు 14: ఫేస్‌బుక్ సృష్టికర్త, మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ తన సతీమణి ప్రిస్కిలా చాన్‌పై తన ప్రేమను చాటుకున్నాడు. తన పనుల్లో ఎంత బిజీగా ఉన్నా పిల్లలతో సైతం ఆడుకుంటూ వారికి కోడింగ్ నేర్పిస్తున్న వీడియోలు వైర ల్ అవుతూనే ఉంటాయి. దీన్ని బట్టి కుటుంబానికి మార్క్ ఎంత విలువనిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే తన భార్యపై ఉన్న ప్రేమ ను చాటుకునేందుకు అపూర్వ కానుకను చాన్‌కు మార్క్ బహూకరించాడు.

రోమన్ సంప్రదాయంలో చాన్ విగ్రహాన్ని రూపొందించి ఆయన తన ఇంటి పెరట్లో ఆవిష్కరించాడు. నీలి రంగులో వెండి వస్త్రం పరిచినట్లు ఆ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఎక్స్‌లో వ్యాఖ్యానిస్తూ భార్య విగ్రహాన్ని చెక్కే రోమన్ సంస్కృతిని తిరిగి తీసుకొచ్చామని రాసు కొచ్చారు. ఈ విగ్రహాన్ని రూపొందించిన డేనియల్ అర్షమ్‌కు కృతజ్ఞ తలు తెలిపారు. మార్క్ పోస్టుకు కామెంట్ చేస్తూ ఇక నన్నెప్పుడూ మీరు మిస్ కాలేరు అంటూ ప్రిస్కిలా అన్నారు. ఈ సంభాషణను చూసి మార్క్ దంపతుల ప్రేమను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.